Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కరీంనగర్ విద్యాశాఖలో కీలక మార్పు.. నూతన డీఈఓగా ప్రశాంత్ రెడ్డి!

Karimnagar: కరీంనగర్ విద్యాశాఖలో కీలక మార్పు.. నూతన డీఈఓగా ప్రశాంత్ రెడ్డి!

hmtv 3 weeks ago

Karimnagar: కరీంనగర్ విద్యాశాఖలో కీలక మార్పు.. నూతన డీఈఓగా ప్రశాంత్ రెడ్డి!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నూతనంగా వచ్చిన ప్రశాంత్ రెడ్డి సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను స్వీకరించారు.

భువనగిరి జిల్లా నుంచి బదిలీపై కరీంనగర్‌కు వచ్చిన ప్రశాంత్ రెడ్డి విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, అదనపు బాధ్యతలను డీఈఓ హోదాలో నిర్వర్తించనున్నారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే నుంచి డీఈఓ ఫుల్ అడిషనల్ చార్జ్‌ను స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలు, విద్యా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాల అమలుపై కలెక్టర్‌తో చర్చించారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానని ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu