Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ధర్నా

Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ధర్నా

hmtv 6 days ago

Karimnagar: కరీంనగర్‌లో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ధర్నా

Karimnagar: కొడుకు చేసిన తప్పును కప్పిపుచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ బేషరతుగా పదవికి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

మైనర్ బాలికను బలవంతం చేసి ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ తప్పు చేయలేదని హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడిన బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేసి తానే చట్టానికి అప్పగించిన అనడం సిగ్గుచేటు అన్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

తప్పు చేయకుంటే ఎందుకు దాచి పెట్టారు..

చట్టం తన చేతిలో ఉంది కదా అని ఎదుటివారిని అభాసపాలు చేసి బాలికపై అసత్యపు ఆరోపణలు చేసి వాళ్ల పరువు తీయడమే కాకుండా మానసికక్షోభకు గురి చేశారన్నారు. తక్షణమే బండి సంజయ్ బేషరతుగా రాజీనామా చేయాలని తెలంగాణ చౌక్ లో ఫ్లెక్సీలు, ఫ్లాకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

తప్పు చేయని బండి భగీరథ్ ను మీరు అప్పగించారా పోలీసులు అరెస్టు చేశారా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదని విమర్శించారు. మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు,జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, శీను, బోనాల శ్రీకాంత్, శ్రీనివాస్, రుద్ర రాజు ఇతర బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu