Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు

hmtv 3 days ago

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు

రీంనగర్: రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలో పలుచోట్ల వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగినాయి.

మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ చిత్రపటానికి వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కి దక్కుతుంది, సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడానికి వారు చేసిన కృషి మరువలేనిదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. రాజీవ్ గాంధీ వల్ల సాంకేతిక విప్లవం వచ్చింది.

వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుందంటే అది ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన టెక్నాలజీ వల్లే అని, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువత ప్రోత్సహించినారని ఈరోజు మనం కంప్యూటర్, సెల్ ఫోన్ మరియు ఇప్పుడు వచ్చిన ఏఐ లాంటి టెక్నాలజీని వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ వల్లే జరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంది అంటే ఆరోజు ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయాలే, రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని అన్నారు.

అనంతరం నగరంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇమ్రాన్ గని, ఆసిఫ్, హరీష్ ఆధ్వర్యంలో కార్ఖానా గడ్డ వృద్దులు, వికలాంగుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో రైతులకు, కార్మికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. నేత బజార్ మార్కెట్ వద్ద కార్పొరేటర్ కళ్లేపెల్లి శారద బాలరాజు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించడంతోపాటు పండ్లు పంపిణీ చేశారు.

అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ మార్క రాజా గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. అర్బన్ డిసిసి ప్రధాన కార్యదర్శి కపిల్ మాధవ్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ,అన్నదానం చేయడం జరిగింది. బదరున్నిసా - యం.డి.పాషా ఆధ్వర్యంలో బొమ్మకల్ ఫ్లైఓవర్ (అబుల్ కలాం) విగ్రహం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాలలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మడుపు మోహన్, గంటకల్యాణి శ్రీనివాస్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,మాచర్ల ప్రసాద్, వంగల విద్యాసాగర్, ముస్తాక్, అహ్మద్ అలీ, విక్టర్, కోడూరు రవీందర్, కంకణాల అనిల్ కుమార్, నిమ్మల అంజయ్య గౌడ్, కుంభాల రాజు కుమార్, మూల జైపాల్, ఇమ్రాన్, పహాద్, పోరండ్లరమేష్, మాదాసు శ్రీనివాస్, గడప శ్రీనివాస్, శిల్ప, సరీళ్ల రతన్ రాజు, షబానా మహమ్మద్, ముక్కా భాస్కర్, సిరిపురం మనోజ్, జిడి రమేష్, దండి రవీందర్,సుంకర్ గణపతి, అబ్దుల్ బారి,అందే శంక,ర్ పెంట శేఖర్,వసీం, స్వప్న శ్రీ,శ్రీరాముల రమేష్, ఇమ్రాన్,అజ్మత్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu