Karimnagar: మందుబాబులకు అడ్డాగా మారిన పద్మనగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
కరీంనగర్: గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చింతకుంట శివారు పద్మ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంచాలని, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆక్రమించి పేదలకు పంచుతామని సిపిఎం నగర కార్యదర్శి గుడి కందుల సత్యం ఒక ప్రకటనలో తెలిపారు.
పద్మా నగర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటిన ఇంకా పేదలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపుగా 90 శాతం పూర్తి అయిన ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయని, నిర్మించి సంవత్సరాల కాలంగా వృధాగా వదిలి పెట్టడం మూలంగా కొన్ని బిల్డింగులు బూత్ బంగ్లాను తలపిస్తూ, శిధిలావస్థకు చేరుకుంటున్నాయని, మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లేదంటే పేదలను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి పేదలకు పంచుతామని అన్నారు.

