Karimnagar: మోడీపై సిపిఐ నేతల నిప్పులు.. కరీంనగర్‌లో ఏం జరిగిందంటే?
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారం మోపే విధంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నిన్న గాక మొన్న ధరలు పెంచమని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వాహనదారులపై అధిక భారం వేస్తున్నారన్నారు. సూచించడం కాదు అమలు చేయండి.
పెట్రోల్ డీజిల్ గ్యాస్ వినియోగం తగ్గించాలి అని ప్రధాని మోడీ అనడం సిగ్గుచేటు. రాజకీయ నాయకులే అధికంగా డీజిల్ పెట్రోల్ వినియోగించి సామాన్యులను తగ్గించాల అనడం గురువింద నీతిని ఎద్దేవా చేశారు. సామాన్యులు మధ్యతరగతి ప్రజలు అవసరము నిమిత్తమే ఏదైనా ఉపయోగిస్తారని కావాలని వాహనాలలో తిరిగేవాళ్లు బడా బాబులు, రాజకీయ నేతలు అన్నారు. ఒక నాయకుని వెంట కాన్వాయ్ లో ఎన్ని వాహనాలు వెళుతున్నాయి ఎంత డీజిల్ వెస్ట్ అవుతుందో ఒకసారి ప్రధాని గమనించాలని సూచించారు. వంట నూనెలు వినియోగం కూడా తగ్గించాలనడం హాస్యాస్పదమన్నారు. వంటకు ఎంత అవసరమో అంతే వాడే వాళ్ళు మధ్యతరగతి సామాన్యులు పేదవాళ్ళని అవసరం లేకున్నా వాడి పారబోసే వాళ్ళు ఎవరో గుర్తించాలని అన్నారు. ముందస్తుగా మీరు వినియోగించే డీజిల్ పెట్రోల్ తగ్గించి సామాన్యులకు మధ్యతరగతి వాళ్లకు సూచించాలన్నారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల చిన్న చిరు వ్యాపారులు, పనులు చేసుకునే వాళ్ళు , రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతు వ్యవసాయం కోసం వినియోగించే డీజిల్ అతి తక్కువగానే ఉంటుందని అవసరానికి మించి ఏ రైతు కూడా డిజిల్ వాడరన్నారు. డీజిల్ రేట్ పెంచడం వల్ల వ్యవసాయంపై అధిక భాగం పడుతుందని రైతులు ఇబ్బందులు పడతారని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPI నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ,కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్,టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,బామండ్ల పెల్లి యుగేందర్, కొట్టె అంజలి,బూడిద సదాశివ,నాయకులు గామినేని సత్యం,బాకం ఆంజనేయులు,చెంచల మురళి,నునావత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

