Dailyhunt
Karimnagar: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం? కలుషిత నీటితో అనారోగ్య భయం

Karimnagar: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం? కలుషిత నీటితో అనారోగ్య భయం

hmtv 2 weeks ago

Karimnagar: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం? కలుషిత నీటితో అనారోగ్య భయం

కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణంలోని గణేశ్ నగర్ కాలనీలో గురువారం మున్సిపాలిటీ సరఫరా చేసిన కుళాయి నీరు కలుషితంగా ఉండటం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

కాలనీవాసుల సమాచారం ప్రకారం, ఇంటింటికీ వచ్చిన నీరు పసుపు వర్ణంలో కనిపిస్తున్నాయని. ఈ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు భయాందోళన వ్యక్తం చేశారు.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, గత కొద్ది రోజులుగా నీటి నాణ్యతలో మార్పులు కనిపిస్తున్నాయని, అయితే గురువారం సరఫరా చేసిన నీరు మరింతగా కలుషితంగా ఉండటంతో పరిస్థితి తీవ్రంగా మారిందని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ నీటిని వాడితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

వేసవికాలం మధ్య దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీటి అవసరం రోజురోజుకు పెరుగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లోనే నీటి సరఫరా ఇలా ఉంటే రాబోయే రెండు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, నీటి నాణ్యతను పరీక్షించి, శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ప్రజలు ఆందోళన కార్యక్రమాలకు దిగే అవకాశం ఉందని కాలనీవాసులు హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu