Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: నిరుపేదలకు సేవ చేయడమే మా లక్ష్యం.. కోమటిరెడ్డి నరేందర్

Karimnagar: నిరుపేదలకు సేవ చేయడమే మా లక్ష్యం.. కోమటిరెడ్డి నరేందర్

hmtv 1 week ago

Karimnagar: నిరుపేదలకు సేవ చేయడమే మా లక్ష్యం.. కోమటిరెడ్డి నరేందర్

Karimnagar: వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడి చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.

నగరంలోని సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో పన్నెండు లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా అనేక మందిని సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నామని అందరికీ అందుబాటులో ఉంటూ వివిధ సమస్యలతో వచ్చే వారి కోసం పనిచేస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడి చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించిన హెల్ప్ డెస్క్ ఎంతో మంది నిరుపేదలకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని ప్రజల దీవెన ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

చెక్కులు పొందిన వారిలో తంగెళ్లపల్లి లచ్చయ్య, గొడుగు పద్మ, బూస రమేష్, సర్దార్ అమరదీప్ కౌర్, సాయిల్ల కొమురవ్వ, చెల్లోజు శివమని, ఉప్పరిపల్లి కనకవ్వ,సర్దార్ గుర్మిత్ సింగ్,తాడూరి అంజలి, సానియా సారహా, చీగిరి దుర్గమ్మ, కొత్త తిరుపతి, కలకుంట్ల రవీందర్ రావు, కల్లేపల్లి శ్రీకర్, బోడనపు రమాదేవి, లింగంపల్లి శంకరయ్య, ఎర్రోజు శ్రీనివాస్, మీర్జా వాజిద్ బేగ్, మీస కొమురయ్య, ఎడ్ల మల్లమ్మ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu