Karimnagar: ఓపెన్ జిమ్ ప్రారంభించిన మేయర్
కరీంనగర్: నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "ఫిట్ ఇండియా" నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు చేపడుతున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
నగరంలోని 24వ డివిజన్‌లో మలయప్ప ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధుల ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు ఇలాంటి సౌకర్యాలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం వేళల్లో వాకింగ్‌కు వచ్చే ప్రజలు, మహిళలు, యువత ఈ ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓపెన్ జిమ్‌ల ద్వారా ప్రజలు ఉచితంగా వ్యాయామ సదుపాయాలను వినియోగించుకోవచ్చని, దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, బండ రమణారెడ్డి, పాలకవర్గ సభ్యులు, వాకర్స్, డివిజన్ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

