Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యంపై మంత్రి కీలక నిర్ణయం!

Karimnagar: రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యంపై మంత్రి కీలక నిర్ణయం!

hmtv 3 weeks ago

Karimnagar: రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యంపై మంత్రి కీలక నిర్ణయం!

కరీంనగర్: పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొనగా, కరీంనగర్ కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పిపిసి కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరి చేరగా ఇప్పటి వరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు తెలిపారు. వరిని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలి, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల తడిసిన వరిని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.

రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని, జిల్లా స్థాయిలో తగినంత టార్పెలిన్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అన్ని పిపిసి కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. మెరుపు,వానల సమయంలో రైతులు కరెంట్ స్తంభాలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమావేశం ఏర్పాటు చేశారు* జిల్లాలో ఐకెపి, పిఎసిఎస్ ల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుకు ధాన్యాన్ని తరలించడంలో రవాణా సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. సీఎంఆర్ పెండింగ్ లో ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారా తెలియజేయాలన్నారు. రైతులు, హమాలీలు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సంబంధిత తహసిల్దార్లు, జిపిఓలు, పంచాయతీ కార్యదర్శులు,ఏపీఎంలు, ప్రత్యేకఅధికారులు పర్యవేక్షించాలని తెలియజేశారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మహేశ్వర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నర్సింగారావు, డిఎం సివిల్ సప్లై రజనీకాంత్, డి ఆర్ డి ఓ శ్రీధర్, డి సి ఓ రామానుజాచారి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu