Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: రైతులకు 'తరుగు' సెగ.. సర్కార్‌పై బండి నిప్పులు

Karimnagar: రైతులకు 'తరుగు' సెగ.. సర్కార్‌పై బండి నిప్పులు

hmtv 3 weeks ago

Karimnagar: రైతులకు 'తరుగు' సెగ.. సర్కార్‌పై బండి నిప్పులు

Karimnagar: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కరీంనగర్ లోని ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.

వారు పడుతున్న వెతలను కళ్లారా చూశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని విషయాన్ని గమనించారు.

ఈ సందర్భంగా రైతులంతా వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని కేంద్ర మంత్రి వద్ద వాపోయారు. తాలు, తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కేజీలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు సగటున రూ.20 వేలకుపైగా నష్టపోయే దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

రైతుల బాధలు తెలుసుకునేందుకు ఇయాళ ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చాను. రైతుల బాధలను కళ్లారా చూస్తున్నా. మండుటెండలో రోజుల తరబడి వాళ్లు వడ్లను విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శంచారు. ఈ సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స్పందిస్తూ ''ఇంకెంతమంది రైతులను బలి కొంటారు? రైతులు చస్తున్నా వడ్లను కొనుగోలు చేయరా? కొనుగోలు కేంద్రాలవద్ద అరిగోస పడుతున్నా స్పందించరా?

ప్రతి గింజకు కేంద్రమే పైసలిస్తుంటే కొనడానికి మీకున్న ఇబ్బందేమిటి? వడ్లు కొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తున్నాం కదా? వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే మంత్రులను రైతులు కొట్టేటట్లు ఉన్నారు. రైతులను నట్టేట ముంచారు. చేతికి పంట వచ్చేదాకా ఒక టెన్షన్ చేతికొచ్చాక అమ్ముకోవడానికి పడిగాపులు కాయాలా?.

90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే. ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారా? కొనుగోలు కేంద్రాలవద్ద టోకెన్లు ఇవ్వడానికి కూడా కమీషన్లు దండుకుంటున్న దుర్మార్గులు. తాలు, తరుగు, తేమ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నా స్పందించరా? వాస్తవాలు మాట్లాడితే. మాపై ఎదురు దాడి చేస్తారా?.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఫీజు రీయంబర్స్ మెంట్ కూడా ఇయ్యలేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తారా?. కేంద్రం ఎస్టీ విద్యార్థుల రీయంబర్స్ మెంట్ కోసం నిధులు మంజూరు చేసినా వాడుకోలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ది. 6 గ్యారంటీలు అమలు చేయడానికి పైసల్లేవంటారు.

ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వడానికి నిధుల్లేవంటారు. ఢిల్లీకి కప్పం కట్టడానికి, కేరళ ఎన్నికల కోసం ఖర్చు చేయడానికి వేల కోట్లు ఇస్తారు. రైతులు చచ్చిపోతుంటే కనీసం స్పందించాలనే సోయి కూడా లేదా?. ప్రభుత్వం వెంటనే యుద్ద ప్రాతిపదికన వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలి. తాలు, తరుగు, తేమ పేరుతో కటింగ్ లేకుండా వడ్లకు కనీస ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu