Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొంటాం!

Karimnagar: రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొంటాం!

hmtv 6 days ago

Karimnagar: రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి గింజ వరకూ కొంటాం!

Karimnagar: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.

జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి సందర్శించారు. రైతులతో కలిసి వారి సమస్యలనుతెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 5 మండలాలు కలిపి జమ్మికుంటలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయడంజరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు.

ఇప్పటివరకు మార్కెఫేడ్ ద్వారా సుమారు 72,500ల బస్తాలు, 36,250 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామని, సోమవారం ఒక్కరోజే 10 వేల బస్తాల మక్కలు కొనుగోలు చేశామని తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇక్కడున్న ముక్కలు పూర్తిగా కొనుగోలు చేసి,గోడౌన్స్ కి తరలించిన తరువాత మరల మార్కెట్ లో కొనుగోలు సజావుగా అయ్యేట్టు చూస్తామని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని మీ వెంట ప్రభుత్వం అధికారులు ఉన్నామని తెలిపారు. అనంతరంమార్కెఫెడ్, జమ్మికుంట వ్యవసాయ పాలకవర్గంతో సమావేశాన్నిఏర్పాటుచేశారు. మక్కలు త్వరగా కొనుగోలు అయ్యేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu