Karimnagar: రూ.10 లక్షల అభివృద్ధి పనులు.. శంకుస్థాపన చేసిన మేయర్!
కరీంనగర్: నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రెండో డివిజన్ తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్, రోడ్ నెం.
5లో రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

