Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: ర్యాంక్ ఫోర్డ్ అకాడమీని వెంటనే మూసివేయాలి...ఎస్ఎఫ్ఐ

Karimnagar: ర్యాంక్ ఫోర్డ్ అకాడమీని వెంటనే మూసివేయాలి...ఎస్ఎఫ్ఐ

hmtv 3 weeks ago

Karimnagar: ర్యాంక్ ఫోర్డ్ అకాడమీని వెంటనే మూసివేయాలి...ఎస్ఎఫ్ఐ

కరీంనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న 'ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ'ని వెంటనే మూసివేయాలని నిరసన.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేకుర్తిలోని ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ అకాడమీల పేరుతో, కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మిస్తూ, ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని అన్నారు. అపార్ట్‌మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్పందించి, జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే అకాడమీల పైన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu