Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన నగర మేయర్ కోలగాని శ్రీనివాస్

Karimnagar: వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన నగర మేయర్ కోలగాని శ్రీనివాస్

hmtv 4 days ago

Karimnagar: వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన నగర మేయర్ కోలగాని శ్రీనివాస్

కరీంనగర్ : నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తో కలిసి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి మార్కెట్‌లో రైతులు తీసుకొచ్చిన ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానాన్ని తెలుసుకున్నారు.

రైతులతో నేరుగా మాట్లాడి పంటలకు లభిస్తున్న ధరలు, రవాణా సమస్యలు, నిల్వ సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మార్కెట్ యార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా పరిస్థితులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని, మధ్యవర్తుల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్లలో ఎలాంటి కటింగులు, కోతలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. తప్పతాలు పేరిట రైతులకు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పంట నిల్వ గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు,సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu