Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kavali: కావలి వైకుంఠపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటన

Kavali: కావలి వైకుంఠపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటన

hmtv 2 weeks ago

Kavali: కావలి వైకుంఠపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటన

కావలి: వైకుంఠపురంలో ఇటీవల మరణించిన మద్దెల మధుసూదన్ రావు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి,, అనంతరం కుటుంబం సభ్యులను పరామర్శించారు కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.

కావలి వైకుంఠపురానికి చెందిన మద్దెల మధుసూదన్ రావు ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన సందర్భంలో నిర్వహించిన వారి పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని, దివంగత మధుసూదన్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ... మధు సూదన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu