Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Khairatabad: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పోలీస్ కేస్.. ఖైరతాబాద్‌లో 2BHK రగడ!

Khairatabad: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పోలీస్ కేస్.. ఖైరతాబాద్‌లో 2BHK రగడ!

hmtv 1 week ago

Khairatabad: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పోలీస్ కేస్.. ఖైరతాబాద్‌లో 2BHK రగడ!

Khairatabad: ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూమ్ లకు తాళాలు వేసిన స్థలాలు కోల్పోయిన అర్హులైన లబ్ధిదారులు.

తమకు అన్యాయం చేసి ఎమ్మెల్యే అక్రమంగా తన అనుచరులకు ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. తమకున్న స్థలాలలో చిన్నపాటి ఇల్లులు నిర్మించుకొని జీవితాలు వెల్లదిస్తున్న తమకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఉన్న స్థలాలను గుంజుకొని తమకు ఇల్లు ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్న బాధితులు.

పదేళ్ల క్రితం తమ స్థలాలను తీసుకొని ఇళ్లను కేటాయించకుండా వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే తానం నాగేందర్ తమ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఎమ్మార్వో ఆర్డీవో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి చుట్టు తిరుగుతున్న న్యాయం చేయడం లేదని వాపోయాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ గూడును ఆలకించి నిజమైన లబ్ధిదారులమైన తమకు ఇళ్లను కేటాయించడంతోపాటు ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu