Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kodurupaka: ఇన్‌ఫ్లోలు లేక వెలవెలబోతున్న మిడ్ మానేరు: తాజా సమాచారం!

Kodurupaka: ఇన్‌ఫ్లోలు లేక వెలవెలబోతున్న మిడ్ మానేరు: తాజా సమాచారం!

hmtv 4 months ago

Kodurupaka: ఇన్‌ఫ్లోలు లేక వెలవెలబోతున్న మిడ్ మానేరు: తాజా సమాచారం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు జలాశయంలో నీటి మట్టం ఉదయం 6 గంటల నాటికి 307.16 మీటర్లుగా నమోదైంది.

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.564 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదుకాలేదు. ఎస్సారెస్పీ (SRSP), ఎస్‌వైపీ (GPH) కాలువల ద్వారా గానీ, మానేరు, ములవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా గానీ నీటి ప్రవాహం లేదు.

అయితే జలాశయం నుంచి మొత్తం 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరీభవనం (Evaporation) ద్వారా 95 క్యూసెక్కులు, ఎంబీ (MB) ద్వారా 45 క్యూసెక్కుల నీటి వినియోగం జరుగుతోంది. కుడి కాలువ (RMC), ఎడమ కాలువ (LMC), ప్యాకేజీ-9, ప్యాకేజీ-10, జీసీఎల్‌ఎస్ (GCLS) తదితర మార్గాల ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు.

ప్రస్తుతం జలాశయం స్పిల్‌వే గేట్లు ఏవీ ఎత్తలేదు. అలాగే రేడియల్ స్లూయిస్ (R/S) గేట్లు కూడా మూసివేసి ఉన్నాయి. జలాశయంలోకి కొత్తగా నీటి ప్రవాహం లేకపోవడంతో నిల్వలు క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu