Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Komarada: ప్రజారోగ్యమే లక్ష్యం లార్వా వేటలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి

Komarada: ప్రజారోగ్యమే లక్ష్యం లార్వా వేటలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి

hmtv 1 week ago

కొమరాడ: ప్రజారోగ్యమే ద్యేయంగా వినూత్న కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరావు అన్నారు.

కార్యక్రమాల పరిశీలనలో భాగంగా చినఖేర్జల పంచాయతీ సీసాడవలస గ్రామంలో లార్వా వేట, నాటు వైద్యానికో నమస్కారం కార్యక్రమాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో గురువారం సాయంత్రం ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ ఇళ్ళ పరిసరాల్లో , నిలవ నీట్లో పెరుగుతున్న దోమల లార్వా ను గుర్తించి, నిర్మూలించడం ఈ కార్యక్రమo ప్రధాన లక్ష్యమని చెప్పారు. దోమల నిర్మూలన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

నాటు వైద్యంతో ఆరోగ్యo పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వాటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉండవని బాటు వైద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన వైద్యాన్ని అనుసరించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ గారు "ప్రవేశపెట్టిన లార్వా వేట మరియు నాటు వైద్యానికో నమస్కారం" కార్యక్ర మాలపై వైద్య సిబ్బంది, వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు అనంతరం నాటు వైద్యంపై ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రదర్శించిన లఘునాటిక అందరినీ ఆకట్టుకుంది. గ్రామస్తులు, విద్యార్థులు, పిల్లలతో డిఎంహెచ్ఓ మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకొని తగు సూచనలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu