కొమరోలు: కేంద్రంలో కొమరోలు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ మెడికల్ వ్యతిరేకంగా మెడికల్ షాపులు బంద్ చేసి పట్టణంలోని ప్రధాన విడులగుండ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయం చేరుకుని ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆన్లైన్ లో మెడికల్ కొనుగోలు మరియు నకిలీ మందులు కొనుగోలు మత్తు మందులు కొనుగోలు చేసి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందనీ అంతేకాక ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 40 అయిదు వేల మెడికల్ స్టోర్ లు ఉన్నాయని స్టోర్ లో పని చేస్తున్న 45 వేల ఫార్మసిస్టులు.
ఈ ఆన్లైన్ మెడిసిన్ సప్లై వలన రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ మెడిసిన్ రద్దుచేసి రాష్ట్రంలోని ఫార్మసిస్ట్ అండ్ మెడికల్ స్టోర్ యజమానులు ఆదుకోవాల్సిందిగా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దివాన్ భాషా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రంగస్వామి. అసోసియేషన్ ట్రెజరీ వెంకటరత్నం. మెడికల్ అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్. విజయ్. శేషు. సందీప్ కుమార్. పాల్గొన్నారు.

