Dailyhunt
Konaseema: కోనసీమలో ప్రజా వేదిక.. సమస్యల పరిష్కారమే లక్ష్యం!

Konaseema: కోనసీమలో ప్రజా వేదిక.. సమస్యల పరిష్కారమే లక్ష్యం!

hmtv 2 weeks ago

Konaseema: కోనసీమలో ప్రజా వేదిక.. సమస్యల పరిష్కారమే లక్ష్యం!

డాక్టర్. బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణంగా పరిశీలించి నూటికి నూరు శాతం అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియాదేవి,డిఆర్ఓ వి సుబ్బారావు, ఆర్డీవో జీ మమ్మీ, ఎస్ డి సి పి కృష్ణమూర్తి,స్వర్ణ సచివాలయ స్వర్ణ వార్డు నోడల్ అధికారి విజయలక్ష్మి ,డి ఎల్ డి వో లు వేణుగోపాల్, రాజేశ్వరరావు అర్జీదారుల నుండి సుమారుగా 153 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుడి సమస్యకు సరైన పరిష్కారం చూపడమే అర్జీ పరిష్కారానికి గీటురాయని ప్రతి ఆర్జీని క్షుణంగా పరిశీలించి పునరావతం కాకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాల్సిందేనన్నారు.

నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సమస్యకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడుపు తీరిన ఆర్జీలు ఏస్థాయిలోను పెండింగ్ ఉండరాదన్నారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు.

జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని ఆర్జీల పరిష్కారంపై నేరుగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన భాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి అన్నారు వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో నిర్దేశ గడువులోగా ఆర్జీలు పరిష్కరించాలని సూచించారు.సీఎంఓ ఎండార్స్మెంట్ అర్జీలకు

ప్రాధాన్యత ఇవ్వాలని పిజిఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో హేతుబద్ధత కలిగి ఉండాలని ఆమె తెలిపారు. అర్జీలను సమగ్రంగా పరిశీలించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను త్వరితగతిన అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కా రంలో పారదర్శకత, సమర్థత పాటించడం అత్యంత ముఖ్యమన్నారు.ప్రతి ఆర్జీని బాధ్యతగా తీసుకుని, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సకాలంలో సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu