Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Konaseema: రెవెన్యూ సమస్యలకు చెక్.. జేసీ కొత్త ప్లాన్

Konaseema: రెవెన్యూ సమస్యలకు చెక్.. జేసీ కొత్త ప్లాన్

hmtv 3 weeks ago

Konaseema: రెవెన్యూ సమస్యలకు చెక్.. జేసీ కొత్త ప్లాన్

Konaseema: ఈనెల 7వ తేదీ నుండి సీసీఎల్ఏ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరి ష్కారానికి వినూత్న రీతిలో నిర్వహించ నున్న" ఒక నెలలో ఒక గ్రామంలో4 పర్యాయాలు సందర్శన కార్యక్రమం" విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియాదేవి రెవిన్యూ సిబ్బందికి పిలుపునిచ్చారు.

బుధవారం ఆమె ఆర్డీవోలు, తహాసిల్దార్లు,మండల సర్వేయర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ సేవలు, రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, జనగణన, గృహ గణన 5 వ విడత రి సర్వే అంశాల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నెలలో ఒక గ్రామాన్ని 4 సార్లు సందర్శన అనే అంశం ప్రధానంగా క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశింపబడిందనన్నారు. ఈనెల ఏడో తేదీ నుండి మండల పరిధిలో రీ సర్వే పూర్తయిన మరియు రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్న ఒక గ్రామాన్ని ఎంపీక చేసుకుని, గ్రామ సభ నిర్వహించి,సమస్య లు నమోదు చేస్తూ రెండవ గురువారం క్షేత్రస్థాయి అధికారులతో చర్చించి 3 వ గురువారం కార్యాచరణ రూపొందించి 4 వ గురువారం పూర్తిగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు.

ఒక నెలలో ఒక గ్రామాన్ని 4 సార్లు సందర్శించి రెవెన్యూ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్నారు. సాధారణంగా గ్రామ సచివాలయాల సందర్శన లేదా రెవెన్యూ సదస్సుల రూపంలో నిర్వహించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఇందులో భాగంగా ప్రతి మండలంలోని రెవెన్యూ అధికారులు తహశీల్దార్లు మరియు సిబ్బంది నెలకు ఒక గ్రామాన్ని కనీసం నాలుగుసార్లు సందర్శించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలన్నారు.

వారానికి ఒకసారి క్షేత్ర పరిశీలన ప్రతి వారం నిర్ణీత రోజున గ్రామాన్ని సందర్శించి భూ సమస్యలు, మ్యుటేషన్లు మరియు ఇతర రెవెన్యూ కుటుంబ సభ్యులు ఆస్తుల పంపిణీ ఆర్ ఓ ఆర్ అంశాలపై విచారణ జరిపి పరిష్కార మార్గాలు చూపాలన్నారు.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా మారుతాయని, ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ఆమె అన్నారు. గ్రామ సందర్శన షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటించడం ద్వారా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలనీ ఆమె జిల్లా

అభ్యుదయ రైతులకు భూయజమాన్యాలకు సూచించారు. సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ముందుగా దృష్టి పెట్టి నమోదు చేస్తూ పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కారం స్థానికంగా ఉన్న వినతులను స్వీకరించి, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. ఆర్డీవోలు,తహాసిల్దార్లు, వీఆర్వో లాగిన్ లో గడువు దాటిన సమస్యలు ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు

చూపాలన్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించి ఆశించిన పురోగతిని సాధించాలన్నారు ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చిన నెగటివ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో ప్రజా సంతృప్తి స్థాయిలను నూటికి నూరు శాతం మెరుగు పరచాలన్నారు. 5 వ విడత రీ సర్వే క్రమ పద్ధతిలో నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు గ్రౌండ్ ట్రూతింగ్, ఈ కేవైసీ. తదితర ప్రక్రియలు సమాంతరంగా నిర్వహించి నిర్దేశిత

గడువులోగా సర్వే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశంగా ఉన్న జనగణన లో భాగంగా గృహ గణన సజావుగా నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి సుబ్బారావు, ఆర్డీవోలు జి మమ్మీ,పి భాగ్యవతి, తాసిల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu