Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Konaseema: 'రెవెన్యూ వన్' పోర్టల్‌తో భూ సేవలు మరింత సులభం

Konaseema: 'రెవెన్యూ వన్' పోర్టల్‌తో భూ సేవలు మరింత సులభం

hmtv 5 days ago

Konaseema: డాక్టర్..బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా లోని రైతులు, ప్రజలు తమ భూముల వివరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా రెవెన్యూ వన్ పోర్టల్ ద్వారా సేవలను సులభతరం చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి తెలిపారు.

మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి, వివిధ జిల్లాల కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే, రెవెన్యూ వన్ రికార్డుల డిజిటలైజేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ,22 A నిషేధిత భూములు అంశాల పురో గతిపై జిల్లాల వారీగా సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ ప్రసంగిస్తూ.. భూమి రికార్డుల ఆధునీకరణ, రీ-సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.జిల్లాలో భూ పరిపాలనను మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ఆశించిన పురోగతిని తీసుకురావాలని సూచించారు. భూముల రీ-సర్వే, పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ మరియు రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ రెవెన్యూ వన్ పనులు జిల్లాలో శరవేగంగా నిర్వహించాలన్నారు.

రీ-సర్వే ​జిల్లాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్లు, రోవర్లు ఉపయోగించి చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ 5వ దశకు చేరుకుందన్నారు. సర్వే పూర్తిచేసిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, సరిహద్దు వివాదాలను పరిష్కరించి రాజముద్రతో కూడిన డిజిటలైజేషన్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తదుపరి విడత సర్వేను కూడా నిర్దేశిత గడువు లోగా పూర్తి చేసేందుకు రెవెన్యూ, సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలోనే సరిహద్దులు నిర్ధారించాలన్నారు.​

చట్టబద్ధమైన హక్కులు ఉండి, పొరపాటున 22-A జాబితాలో చేరిన రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులను రీ-వెరిఫికేషన్ చేసి, అర్హత కలిగిన భూములను నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు తమ భూములపై పూర్తి స్వేచ్ఛ క్రయ విక్రయాల హక్కులు సంక్రమింప చేయడం జరుగుతుందన్నారు.​ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ​రీ-సర్వే పూర్తి చేసుకుని,

రికార్డులు క్లియర్ అయిన ప్రతి రైతుకు కొత్తగా డిజైన్ చేసిన క్యూఆర్ కోడ్‌ తో అత్యంత భద్రతతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల ను పంపిణీ చేపట్టి రైతులకు నేరుగా వారి గ్రామాల్లోనే ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు.​ మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరితగతిన ముద్రణ పూర్తి చేసి, పంపిణీ చేసేందుకు చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు.​ రెవెన్యూ వన్ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టి ​​జిల్లాలోని వందేళ్ల నాటి పాత రెవెన్యూ రికార్డులు ఫేర్ అడంగల్,

ఎఫ్.ఎం.బీ, అన్నింటినీ వందశాతం డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు.​ దీనివల్ల భూముల ట్యాంపరింగ్‌కు అడ్డుకట్ట పడటమే కాకుండా వెబ్‌ ల్యాండ్ డేటా అత్యంత సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూమి నకళ్లను ఆన్‌లైన్‌లో పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి.సుబ్బారావు, ఆర్డీవోలు ఏ.సరళావతి, జి.మమ్మీ, సెక్షన్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu