Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kondamallepally: ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన అభివృద్ధి పనుల జోరు!

Kondamallepally: ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన అభివృద్ధి పనుల జోరు!

hmtv 1 week ago

Kondamallepally: ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన అభివృద్ధి పనుల జోరు!

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి.

ప్రజాపాలనలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం.

నేనావత్ బాలు నాయక్ కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ భావన నిర్మాణ పనులకు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కొండమల్లేపల్లి పట్టణంలోని కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పేదల ఆత్మగౌరవపు చిరునామ, ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తుంది. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లను విజయవంతంగా లబ్దిదారులకు అందించాము. రెండవ విడత, మూడవ విడత, నాల్గవ విడతలో కూడ గూడులేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించే లక్ష్యంగా ప్రతి గ్రామం, పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం.

స్థానిక ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు. డ్రైనేజీ పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తగ్గి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కొండమల్లేపల్లి గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.

దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచు పసునురు యుగేందర్ రెడ్డి ఉపసర్పంచ్ కొడిదాల పద్మ వెంకటయ్య వార్డు నెంబర్స్ బిజీలి లింగం గంట మల్లేష్ పర్వతం కొండలు ముచ్చర్ల మాధవి కరుణాకర్ బత్తుల మమత విజయ్ ఊరే నరేష్ ఎలిమినేటి సాయి బూడిద మంజుల మల్లేష్ యాదవ్ బొడిగ శంకర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu