Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothagudem: అమావాస్య, శని త్రయోదశి.. ఆలయాల్లో తైలాభిషేకాలు

Kothagudem: అమావాస్య, శని త్రయోదశి.. ఆలయాల్లో తైలాభిషేకాలు

hmtv 1 week ago

Kothagudem: అమావాస్య, శని త్రయోదశి.. ఆలయాల్లో తైలాభిషేకాలు

Kothagudem: శని జయంతి, అమావాస్య కలసి వచ్చిన అరుదైన విశిష్టమైన రోజు కావడంతో కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయం, పాల్వంచ గట్టాయిగూడెం భక్తాంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేకాలు నిర్వహించిన భక్తులు.

ఈసందర్భంగా భక్తాంజనేయ స్వామి ఆలయ అర్చకులు వింజమూరు వేణుగోపాలాచార్యులు అమావాస్య శనిత్రయోదశి విశిష్టతను వివరించారు.

శనివారం విశేషించి అమావాస్య కావడం, అందునా వైశాఖ మాసం శని వారం అమావాస్య శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో.. త్రయోదశి తిథి కలిసి వచ్చిన నేపథ్యంలో భక్తులు శని దోషాల నివారణకు, శివారాధనకు విశిష్టమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే నవగ్రహ ఆలయాలకు విచ్చేసినట్లు తెలిపారు. నవగ్రహాలకు విశేషించి శని గ్రహానికి తెల్లవారుజాము నుండి అత్యంత వైభవోపేతంగా తైలాభిషేకాలు, అర్చన, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

విశేషించి ఈ రోజున ఎవరైతే శని గ్రహానికి తైలాభిషేకాలు చేస్తారో వారికి ఏలినాటి పితృ దోషాలు, కాలసర్ప దోషాలు, శని దోషాలు ఏలిన నాటి శని అష్టమ శని తొలగిపోతాయని మన వేదాలు చెబుతున్నాయి న్నాయని వివరించారు. శనిభగవానుడికి ప్రీతికరమైన, విశిష్టమైన రోజు కావడంతో భక్తులు శని గ్రహానికి తైలాభిషేకం, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు, ఇనుమును దానం చేయడం జరిగిందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu