Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothagudem: కొత్తగూడెం డ్రిప్ ఆటోమేషన్‌తో స్మార్ట్ వ్యవసాయానికి ప్రోత్సాహం

Kothagudem: కొత్తగూడెం డ్రిప్ ఆటోమేషన్‌తో స్మార్ట్ వ్యవసాయానికి ప్రోత్సాహం

hmtv 2 weeks ago

Kothagudem: కొత్తగూడెం డ్రిప్ ఆటోమేషన్‌తో స్మార్ట్ వ్యవసాయానికి ప్రోత్సాహం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి కొరత / ఎద్దడి పరిస్థితులను అధిగమించడానికి ఉద్యాన పంటల సాగులో అధిక ఉత్పాదకత సాధించేందుకు డ్రిప్ నీటిపారుదల ఆటోమేషన్ సాంకేతికతను ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది.

ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా ఈ సాంకేతికత రైతులకు సమయం ఆదా, శ్రమ మరియు ఖర్చును తగ్గించడంతోపాటు పంటల నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది.

డ్రిప్ ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా రైతులు మొబైల్ ఫోన్ లేదా కంట్రోలర్ సహాయంతో పంటలకు నీటిపారుదల ప్రక్రియను స్వయంచాలకంగా నిర్వహించవచ్చు. నిర్ణీత సమయాల్లో పంటలకు అవసరమైన మేరకు నీరు అందడం వల్ల నీటి వినియోగంలో 30 నుండి 40 శాతం వరకు పొదుపు సాధ్యమవుతుంది. అలాగే పంటల పెరుగుదల సమానంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.

రైతులు ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్యాన శాఖ ఒక హెక్టార్ నకు యూనిట్ ధర రూ.40,000/- నిర్ణయించడం జరిగింది (55% సబ్సిడీ రూ.22,000 చిన్నకారు, సన్నకారు, యస్.సి. యస్.టి రైతులకు మరియు 45% సబ్సిడీ రూ.18000 పెద్ద రైతులకు) RKVY / PDMC పధకం ద్వారా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పటికే డ్రిప్ వ్యవస్థ కలిగిన రైతులు కూడా ఆటోమేషన్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఈ సబ్సిడీని పొందవచ్చు.

కావున ఉద్యాన పంటల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఉద్యాన శాఖ కోరుతోంది. ఆసక్తి గల రైతులు తమ సమీప ఉద్యాన శాఖ కార్యాలయం లేదా మండల ఉద్యాన అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu