Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothagudem: కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్ రాజు జెండా ఆవిష్కరణ

Kothagudem: కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్ రాజు జెండా ఆవిష్కరణ

hmtv 1 week ago

Kothagudem: కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్ రాజు జెండా ఆవిష్కరణ

కొత్తగూడెం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు, పోలీసు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ అధికారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది మహనీయుల త్యాగాల ప్రతిరూపం అని వారి పోరాటాల, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని,సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అదేవిధంగా సామాన్య ప్రజలకు న్యాయం చేకూరే విధంగా సహకరించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పతకాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ రాజు వర్మ చర్ల పోలీస్ స్టేషన్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్స్ బి.రవి ఇరువురికి శౌర్య పతకాలు వచ్చిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో కఠిన, ఉత్తమ సేవ, సేవ పతకాలు పొందిన వారికి కూడా అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజనల్ డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డీఎస్పీ మల్లేష్ స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu