Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

hmtv 3 days ago

Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి

కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండల కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో భారతదేశ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రదాత, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

దేశానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను, ముఖ్యంగా ఐటీ రంగంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన గొప్ప విజేత రాజీవ్ గాంధీగారని, యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో DCC జనరల్ సెక్రటరీ పెదబాబు, పూణెo. శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి MD.గౌస్ పాషా, యాసారపు.నరసింహారావు, సర్పంచ్ లు లావుడ్య.పూర్ణా, నూనావత్.సేవ, అజ్మీరా.లైలా బండ.వెంకటేశ్వర్లు, కొంపల్లి.వీరయ్య,పాయం.లక్ష్మీనర్సు, గడ్డిగుట్ట నరేష్, వర్ష.నరసింహారావు, మాచర్ల.శ్రీను, జోగ.శ్రీను, దయ్యాల.సమ్మయ్య, రావు.మధు, రేగళ్ళ.శంకర్, ఉయ్యూరి.శ్రీను, అంతడపుల.కృష్ణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu