Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothagudem: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన!

Kothagudem: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన!

hmtv 1 week ago

Kothagudem: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన!

Kothagudem: ప్రధానమంత్రి మోడీది స్వదేశీ నినాదం.. విదేశీ వ్యామోహం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కొత్తగూడెంలోని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం నుండి ఆటో కి తాడు కట్టి లాగుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ తాను వేసుకునే కోర్టు తాగే నీళ్లు చేతులు పెట్టుకునే వాచి విదేశీ వాడుతూ ప్రజలకు మాత్రం స్వదేశీ నినాదం ఇస్తున్నారని మోడీ గారి స్వదేశీ నినాదం పొదుపు సూత్రాలు సామాన్య ప్రజలకేనా ఆయనకు వర్తించవా అని ప్రశ్నించారు.

ప్రధానమంత్రి చెబుతున్న పొదుపు మంత్రంతో దేశాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రభావం ప్రజలపై నేరుగా పడుతుందని, గ్యాస్‌ ధరల పెంపుతో ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్యాస్‌ ధరలను రెండు దఫాలుగా మోదీ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. ఈ ధరల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపైనా, సామాన్య ప్రజానీకంపైనా తీవ్ర భారాన్ని మోపుతుందన్నారు.

ఇరాన్‌- అమెరికా, ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధం జరుగుతున్నది కాబట్టి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ చూపడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అప్పుడే చెప్పామని పొదుపు పాటించట్లేదు కాదు కాబట్టి ధరలు పెంచుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నేరం చేసేవాడు ఒకడైతే ప్రజలకు శిక్ష‍ వేసే పరిస్థితి నేడు నెలకొందని ఎద్దేవా చేశారు. అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం ఆగితే ఈ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే, ప్రధాన మంత్రి మోడీ యుద్ధ నివారణ చర్యలు తీసుకోకుండా, అమెరికాకు దాసోహం అయిపోయి ట్రంప్‌కు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రజలు మాత్రం ధరల భారాలను భరించాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

అంతకుముందు పొదుపు చర్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. యూరియాను మానేయండి..విదేశీ ప్రయాణాలు ఆపండి...బంగారం కొనకండి.. ఆఫీసులకు వెళ్లకుండా వర్క్‌ఫ్రమ్‌ హోం చేయండి అనటం సరికాదని అవన్నీ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఏం కావాలని ప్రశ్నించారు. ఉత్పత్తి దెబ్బతిన్న తర్వాత దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. యుద్ధం చేస్తున్న వారికి మద్దతిచ్చేలా మోడీ విదేశీ పర్యటనలు ఉంటున్నాయని విమర్శించారు.

అమెరికాకు దాసోహం అనడం వల్లనే ఈరోజు ఇరాన్ నుండి హార్మోస్ జల సంధి ద్వారా రావలసిన పెట్రోల్ డీజిల్ రవాణా ఆగిపోవడం వలన ప్రజలపై పెట్రోల్ డీజిల్ వారాలు మోపుతున్నారని అన్నారు. తాను విశ్వగురు అని డాంబికలు పలికే మోదీ గారు యుద్ధాన్ని ఆపి అమెరికా మీద ఒత్తిడి తెచ్చి హర్మోజ్ జల సంధిని తెరిపించలేరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ లిక్కి బాలరాజు రేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ నాయకులు నందిపాటి రమేష్ నాగకృష్ణ సతీష్ బాలకృష్ణ రాములు సలీం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu