Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kowdipally: ప్రతి పిల్లాడూ బడిలో ఉండాలి.. ప్రధానోపాధ్యాయురాలు సరోజ

Kowdipally: ప్రతి పిల్లాడూ బడిలో ఉండాలి.. ప్రధానోపాధ్యాయురాలు సరోజ

hmtv 1 week ago

Kowdipally: ప్రతి పిల్లాడూ బడిలో ఉండాలి.. ప్రధానోపాధ్యాయురాలు సరోజ

కౌడిపల్లి: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లోని కౌడిపల్లి మండలo లోని వెల్మకన్న గ్రామంలో బడిబాట కార్యక్రమం లో బాగంగా ప్రతి పిల్లాడిని బడిలో చేర్పించడమే ముఖ్య ఉద్దేశ్యంగా గ్రామంలో 5-14 ఏళ్ల పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించడానికి మరియు బడి మానేసి మళ్లీ రాని పిల్లలను గుర్తించి ఉపాధ్యాయ బృందం ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ బడికి వచ్చేలా చేయడం జరుగుతుంది అని ZPHS వెల్మకన్న ప్రధానోపాధ్యాయురాలు సరోజ మరియు ఉపాధ్యాయబృందం అన్నారు.

ప్రభుత్వ బడిలో మంచి ఉన్నత విద్యా హర్హతలు కలిగిన ఉపాధ్యాయ బృందం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, "బడికి పంపితే ఎలాంటి డబ్బులు ఖర్చు కాకుండా నాణ్యత కలిగిన విద్యా బోధన ప్రత్యేకత అనే నమ్మకం పెంపొందించేలా బడి వయస్సు కలిగిన"ప్రతి ఒక్క పిల్లాడు బడి బయట కాదు బడిలోనే చదువుకోవాలి అనేదే బడిబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ప్రధానోపాధ్యాయురాలు సరోజ మరియు ఉపాధ్యాయ బృందం అన్నారు. బడి బాట కార్యక్రమంలో ZPHS వెల్మకన్న ప్రధానోపాధ్యాయురాలు సరోజ, ఉపాధ్యాయ బృందం, కారొబార్ మరియు మాజీ సర్పంచ్ రాజేందర్, కిషన్ లు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu