Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kukatpally: లోధా బెల్లెజ్జా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Kukatpally: లోధా బెల్లెజ్జా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

hmtv 1 week ago

Kukatpally: లోధా బెల్లెజ్జా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Kukatpally: కూకట్‌పల్లి నాలుగో ఫేజ్‌లోని లోధా బెల్లెజ్జా గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

కమ్యూనిటీ పరిధిలోని 2బీ టవర్‌లో ఉన్న ఫ్లాట్ నెంబర్లు 29, 30 డూప్లెక్స్ నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటల కారణంగా ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైనట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu