Kukunoor: కుక్కునూరులో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి
Kukunoor: ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర. రాజేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రింగ్ రోడ్డు సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు తాండ్ర. రాజేష్ మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహా నేతని కొనియాడారు. రైతులు విద్యార్థులు మహిళలు వృద్ధుల వంటి ప్రతి వర్గం సంక్షేమమే ద్వేయంగా ఎన్నో ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల జీవితాన్ని వెలుగులు నింపారని ఆయన అన్నారు వైయస్సార్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకువెళ్లాలని ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతు ఆయన చూపిన మార్గంలోనే పార్టీ నాయకులు కార్యకర్తలు నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహారాజు ఎంపీటీసీ సూరిబాబు సీనియర్ నాయకులు మాదిరాజు వెంకన్న బాబు రావి సత్యనారాయణ నవీన్ వర్మ భాను ప్రసాద్,పగిళ్ళ అనిల్,రావు సత్యనారాయణ, జక్కం నాగేశ్వరావు, కుచర్లపాటి చిన నరసింహారాజు, రాయి రవి, వేల్పుల రవి, గంజి శ్రీను, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

