Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kuppam: కుప్పం జాతర.. ఉగ్రరూపంలో ఊరేగిన గంగమ్మ తల్లి శిరస్సు!

Kuppam: కుప్పం జాతర.. ఉగ్రరూపంలో ఊరేగిన గంగమ్మ తల్లి శిరస్సు!

hmtv 5 days ago

Kuppam: కుప్పం జాతర.. ఉగ్రరూపంలో ఊరేగిన గంగమ్మ తల్లి శిరస్సు!

కుప్పం: ఉగ్రరూపంలో ఊరేగిన ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు.. కుప్పం జాతరలో భక్తుల వెల్లువ కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో వైభవంగా శిరస్సు ఊరేగింపు చెరువుకట్ట కోనేరు వద్ద వేదపండితుల ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి శిరస్సు తెర తొలగింపు పెద్ద బావి కోనేరు వద్ద ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు మేళతాళాలు, పలక వాయిద్యాల నడుమ పట్టణ వీధుల్లో అమ్మవారి శిరస్సు ఊరేగింపు.

అడుగడుగునా నీరాజనాలు, మొక్కుబడులతో అమ్మవారికి భక్తుల విశేష పూజలు గంగమ్మ జాతరతో కిక్కిరిసిన కుప్పం పట్టణం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఉగ్రరూపంలో దర్శనమిచ్చిన గంగమాంబకు భారీగా జంతుబలులు సమర్పించిన భక్తులు రక్తార్చిత చందనం సమర్పించి అమ్మవారు శాంతించాలంటూ ప్రత్యేక ప్రార్థనలు గతంలో ఎన్నడూలేని స్థాయిలో జాతరలో జంతుబలులు జరిగినట్లు స్థానికుల వ్యాఖ్యలు గంగమాంబ ఆలయంలో ఉదయం నుంచే దర్శనానికి బారులు తీరిన భక్తులు

అమ్మవారి బలిపీఠం వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆశీర్వాదాలు జంతుబలులపై పోలీసులు ప్రత్యేక ఆంక్షలు.. బలిదారులకు గుర్తింపు కార్డుల జారీ శిరస్సు ఊరేగింపుకు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ట్రాఫిక్ మళ్లింపులతో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు అమ్మవారికి పిండి దీపాలు సమర్పించిన భక్తులు.. విచిత్ర వేషధారణలో మొక్కులు చెల్లింపు బుధవారం విశ్వరూప దర్శనం నేపథ్యంలో ఆలయ కమిటీ, పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu