Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: బండిమెట్ట యూపీహెచ్‌సీలో నెలవారీ 'ఆశా డే' సమావేశం!

Kurnool: బండిమెట్ట యూపీహెచ్‌సీలో నెలవారీ 'ఆశా డే' సమావేశం!

hmtv 3 weeks ago

Kurnool: బండిమెట్ట యూపీహెచ్‌సీలో నెలవారీ 'ఆశా డే' సమావేశం!

కర్నూలు: కర్నూలు లోని బండిమెట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు,ఆశా కార్యకర్తలకు నెలవారీ ఆశా డే మీటింగ్ నిర్వహించినారు.

ఈ సందర్భంగా డాక్టర్.ముషాహిద్ మాట్లాడుతూ కత్తి ,లోహపు రేకు,గాజుపెంకు లాంటివి పొరబాటున గుచ్చుకుంటేనో లేదా కిందపడి కాలు,చేయి గీరుకుపోతేనో శరీరంరంలోకి ప్రవేశించి టెటనస్ టాక్శైడ్ బ్యాక్తిరియ ధనుర్వాతం వస్తుందని ,దవడ బిగుసుకోవడం, కండరాలు గట్టిపడడము, ఊపిరి పిల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయని.

శరీరం ధనస్సులా వంగి పోయే పరిస్థితి కూడా ఏర్పడే ఈ వ్యాధి ప్రాణాంతకమని తెలిపారు. 10 సంవత్సరముల వయస్సు నుంచి 16 సంవత్సరములు పూర్తయిన పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని అలాగే గర్భిణిలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.ఈ టీకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్ల్ల్లో ఉచితంగా ఈ టీకాలు వేస్తారని తెలిపారు.

హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పద్మావతి మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలకు,ఆశా కార్యకర్తలు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. లెప్రసీ వ్యాధి గురించి మాట్లాడుతూ ఏ మచ్చ ఉన్న మెడికల్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని ఈ కార్యక్రమములో వైద్య సిబ్బంది విజయ్, మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu