Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: ఎస్సీ, ఎస్టీ బాధితులకు భరోసా.. త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశం!

Kurnool: ఎస్సీ, ఎస్టీ బాధితులకు భరోసా.. త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశం!

hmtv 1 week ago

Kurnool: ఎస్సీ, ఎస్టీ బాధితులకు భరోసా.. త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశం!

కర్నూలు : ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి రావల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు కు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు పెన్షన్ నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ , ఎస్టీ అత్యాచార కుటుంబ బాధితులకు విడుదలైన నిధులకు సంబంధించిన సీఎఫ్‌ఎంఎస్ (CFMS) ఐడీల సృష్టిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ భూముల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వ భూములను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలో సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గృహ స్థలాల కేటాయింపులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కూడా అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. సంప్రదాయ గృహ స్థలాల కేటాయింపుకు బదులుగా అవసరమైన అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో (TIDCO) గృహాలను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టాయిలెట్ల మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. 10 నుంచి 15 రోజుల్లో సంబంధిత పనులు పూర్తికానున్నాయన్నారు. హాస్టళ్లలో ఆర్‌ఓ ప్లాంట్లు, మెష్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా విస్తృతంగా చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్స్ డే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. అదే విధంగా సంబంధిత కార్యక్రమానికి డి వి ఎం సి సభ్యులను ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వహించిన సివిల్ రైట్స్ డే కార్యక్రమం యొక్క ఫోటోలను తనకు పంపాలని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహణ కు సంబంధించి వచ్చే సోమవారం నుండి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి రాధిక గత సమావేశంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో డి వి ఎం సి సభ్యులు ప్రస్తావించిన అంశాల పై అధికారులు తీసుకున్న చర్యల గురించి వివరించారు.

పారిశుధ్య కార్మికులకు గ్లోవ్స్, ఇతర పరికరాలను అందించండి

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం అనంతరం సఫాయి కర్మచారుల సమావేశం నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు గ్లోవ్స్, ఇతర పరికరాలను అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో హౌసింగ్ పిడి చిరంజీవి, డి ఆర్ డి ఏ పిడి రమణ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ మనోహర్, డ్వామా ఏపిడి మాధవి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి తులసి దేవి, డివిఎమ్ సి సభ్యులు మాలతి, సురేంద్ర, మద్దిలేటి, వెంకట నాగరాజు, రవి కుమార్, మధు నాయక్, రాజేంద్ర ప్రసాద్, సురేష్ గౌడ్, మద్దిలేటి, స్కావెంజర్ కమిటీ సభ్యులు ధర్మరాజు, రాజేంద్రప్రసాద్, భాను తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu