కర్నూలు: జొన్నగిరి గోల్డ్ మైనింగ్ పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర కీలక కామెంట్స్. మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్ దేశ చరిత్రలోనే తొలి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరిలో రెడీ అవుతోంది మంత్రి కొల్లు రవీంద్ర.
సీఎం చంద్రబాబు గారి చొరవతో వచ్చే నెలలోనే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం. ఈ ఏడాది 600 కేజీలు, వచ్చే ఏడాది 1500 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యం రాష్ట్రానికి 50 నుంచి 60 శాతం బంగారం ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది.
జొన్నగిరి గోల్డ్ మైన్స్ ను గత ప్రభుత్వం వారి స్వార్థాల కోసం దుర్వినియోగం చేయడం జరిగింది మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. పర్యావరణ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు భూసేకరణలో రైతులకు అన్యాయం జరగనివ్వం.. గ్రామసభ అనుమతి తప్పనిసరి.
బంగారం దిగుమతుల భారం తగ్గించి విదేశీ మారకం ఆదా చేస్తాం. జొన్నగిరిని దేశ గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. జొన్నగిరి బంగారు గని పనులు వేగవంతం.. త్వరలో సీఎం ప్రారంభం - మంత్రి కొల్లు రవీంద్ర, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గ్రంధాలయ శాఖ చైర్మన్ బిసి కార్పొరేషన్ చైర్మన్ కంపట్రాళ్ల బుజ్జమ్మ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

