Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: కార్పొరేట్ వైద్యానికే సవాల్.. GGHలో యువకుడికి పునర్జన్మ!

Kurnool: కార్పొరేట్ వైద్యానికే సవాల్.. GGHలో యువకుడికి పునర్జన్మ!

hmtv 1 week ago

Kurnool: కార్పొరేట్ వైద్యానికే సవాల్.. GGHలో యువకుడికి పునర్జన్మ!

Kurnool: నంద్యాల జిల్లాకు చెందిన 17 ఏళ్ల తౌఫిక్ అనే యువకుడు గతేడాది (30/08/2025) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రైవేట్ ఆసుపత్రులు సైతం చికిత్స అందించలేమని చేతులెత్తేసిన తరుణంలో, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతడిని రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు.

JCB మరియు బైక్ ఢీకొన్న ప్రమాదంలో తౌఫిక్ చిన్న, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని బయటకు వచ్చాయి. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కేసును తిరస్కరించాయి. ఆఖరి ప్రయత్నంగా కుటుంబ సభ్యులు కర్నూలు GGHను ఆశ్రయించారు.

యూనిట్-5 వైద్య బృందం సుమారు 7 గంటల పాటు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి దెబ్బతిన్న పేగులకు చికిత్స అందించారు. ప్రమాదం వల్ల కోల్పోయిన కండర శక్తిని తిరిగి పొందేందుకు రోగికి దాదాపు 8 నుండి 9 నెలల సమయం పట్టింది. మధ్యలో ఏర్పడిన 'ఎంటెరోక్యూటేనియస్ ఫిస్టులా' సమస్యకు కూడా విజయవంతంగా సర్జరీ నిర్వహించారు.

ప్రస్తుతం తౌఫిక్ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇంతటి భారీ ఖర్చుతో కూడుకున్న చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడటం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి క్లిష్టమైన కేసును సవాలుగా తీసుకుని, తౌఫిక్‌కు పునర్జన్మ ప్రసాదించిన యూనిట్-5 సర్జరీ విభాగం మరియు అనస్థీషియా బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు గారు ప్రత్యేకంగా అభినందించారు.

కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చికిత్స అందించలేమని వెనకడుగు వేసిన తరుణంలో, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించి రోగిని కాపాడటం గర్వకారణమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించండి. బాధ్యతాయుతంగా వాహనాలు నడపండి. చిన్న నిర్లక్ష్యం కూడా జీవితాంతం బాధలకు దారితీస్తుంది. ప్రమాదాలను నివారించి అనవసరమైన అనారోగ్యం మరియు బాధలను తగ్గిద్దాం.

ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన వారు

సర్జరీ విభాగం (యూనిట్-5) డా. కె. మాధవి శ్యామల (చీఫ్), డా. డి.వి. చంద్ర రెడ్డి, డా. ఎస్. శృతి (అసిస్టెంట్ ప్రొఫెసర్లు), మరియు పి.జి.లు డా. సాయి కుమార్, డా. దేవిక, డా. షమీర్, అనస్థీషియా విభాగం డా. శివ నాయక్ మరియు వారి బృందం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu