Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: కప్పట్రాళ్లలో తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

Kurnool: కప్పట్రాళ్లలో తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

hmtv 2 days ago

Kurnool: కప్పట్రాళ్లలో తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం

Kurnool: దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కప్పట్రాళ్ల సురేంద్ర , కప్పట్రాళ్ల మల్లికార్జున స్పందించారు.

గ్రామంలో తాగునీటి కొరత ఎక్కువగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన అధికారులు, తక్షణ చర్యగా తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

గ్రామ ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా నీటి ట్యాంకర్‌ను సిద్ధం చేసి పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేసవి తీవ్రత పెరగడంతో నీటి అవసరం అధికమైందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం తాగునీరు సరఫరా చేసేలా చర్యలు కొనసాగుతున్నాయని కప్పట్రాళ్ల మల్లికార్జున, కప్పట్రాళ్ల సురేంద్ర పేర్కొన్నారు.

గ్రామస్తులు కూడా సమస్యపై స్పందించిన కప్పట్రాళ్ల సురేంద్ర, కప్పట్రాళ్ల మల్లికార్జున కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కప్పట్రాళ్ల గ్రామస్తులు కౌలుట్లయా, చాకలి లక్ష్మన్న, యర్ర కౌలుట్లయా, చింతామను సుధాకర్, గిడ్డయ్య గిరాపాగేరి వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu