Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ బస్తిపాటి ఆకస్మిక తనిఖీ!

Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ బస్తిపాటి ఆకస్మిక తనిఖీ!

hmtv 2 weeks ago

Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ బస్తిపాటి ఆకస్మిక తనిఖీ!

కర్నూలు: నగరంలోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో గల కేంద్రీయ విద్యాలయాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు...ఈ సందర్బంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను ఆయన పర్యవేక్షించారు.

తరగతి గదులను పరిశీలించి ఎలా చదువుతున్నారు, భవిష్యత్తు లో ఏమి కావాలని కోరుకుంటున్నారని విద్యార్థులతో మాట్లాడిన ఎంపీ, కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు.

అనంతరం విద్యార్థులకు మరింత నాణ్యమైన, అనుభవపూర్వకమైన విద్యను అందించాలని, మౌలిక సదుపాయాలలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందికి ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu