Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: కర్నూలు ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక

Kurnool: కర్నూలు ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక

hmtv 3 weeks ago

ర్నూలు: జిల్లాకు ఖరీఫ్ 2026 గాను, అన్ని పంటలకు అవసరమైన 45,599 మెట్రిక్. టన్నుల యూరియా ఎరువు పంపిణీకి ప్రణాళిక చేయడమైనది. 01.04.2026 నాటికి 13853 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభనిల్వలు అందుబాటులో ఉన్నాయి.

01.04.2026 నుండి 30.09.2026 వరకు కర్నూలు జిల్లాకు మొత్తం 45599 మెట్రిక్ టన్నుల అవసరం కాగా, ఇప్పటికే 23203 మెట్రిక్ టన్నుల యూరియా ను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది.

30.05.2026 ఈ నెలాఖరుకు గాను అవసరమైన యూరియా అందుబాటులోఉన్నది. ప్రస్తుతం 17555 మెట్రిక్ టన్నుల యూరియాను కో-ఆపరేటివ్ సొసైటీలలో, రైతు సేవ కేంద్రాలలో, మార్క్ ఫెడ్ గోదాములలో, రిటైల్/హోల్ సేల్, మరియు కంపెనీ గోదాములలో ఎరువును రైతాంగానికి అందుబాటులో ఉంచడమైనది.

జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువుల కొరత లేదు. దేశీయంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేయుచున్నవి. అలాగే విదేశాలనుండి కూడా అవసరమైన యూరియా దిగుమతులు సంతృప్తి కరంగా ఉన్నవి. కనుక రాబోయే పంట కాలంలో కూడా యూరియా కు ఎటువంటి కొరత రాదని తెలియపరచడమైనది.

నూతనంగా రూపొందించబడి సాంకేతికంగా అభివృద్ధి పరిచిన నానో యూరియా,నానో డి.ఎ.పి ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగినది. ఇవి సాంప్రదాయ ఎరువులకు నూరు శాతం ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రోత్సాహిస్తున్నాయి.

కావున, రైతు సోదరులకు తెలియచేయడం ఏమనగా, ఎరువులను కొనుగోలు చేయునప్పుడు బస్తాపై ముద్రించిన ఎం. ఆర్. పి ధరలను చూసుకుని, దాని ప్రకారము పైకము చెల్లించి. తప్పని సరిగా డీలరు నుండి రశీదు పొందవలెను.

ఎవరైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా ఎరువులను ఇతర ప్రాంతాలకు మళ్లింపు చేసిన, ఎం. ఆర్.పి ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్రయించిన ఎడల, వారి యొక్క లైసెన్స్ లు రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం 1985.

ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును అని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి.పి.ఎల్.వరలక్ష్మి తెలియచేయడమైనది. ఎరువుల లభ్యతపై సందేహాలు /సమస్యలున్నచో 8341302863 నంబరును సంప్రదించగలరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu