Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kurnool: యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన

Kurnool: యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన

hmtv 2 weeks ago

Kurnool: జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు వారి ఆధ్వర్యంలో సర్వోదయ ఐటిఐ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం - ఉపాధి అవకాశాలు అనే అంశం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం లో సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ

ప్రపంచం వేగంగా మారుతోందని,ఈ మారుతున్న కాలంలో కేవలం డిగ్రీలు కలిగి ఉండటం మాత్రమే సరిపోదని నిజమైన విజయం సాధించాలంటే నైపుణ్యాలు ఉండాలన్నారు. నైపుణ్యాలు అంటే కేవలం ఉద్యోగానికి సంబంధించిన సామర్థ్యం మాత్రమే కాదని అవి మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన పనితీరును, మన భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అన్నారు.

యువతకు అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని సరైన దిశలో వినియోగించగలిగితే, ఏ అడ్డంకీ పెద్దది కాదు. ఒక యువకుడు లేదా యువతి నిరంతరం నేర్చుకునే మనస్తత్వాన్ని పెంచుకుంటే, వారు జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని తీయియచేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం,

నాయకత్వ లక్షణాలు, సమయపాలన, బృందంగా పనిచేయగలగడం వంటి నైపుణ్యాలు ఈరోజు అత్యంత అవసరం అని వివరించారు. ఈ రోజుల్లో కంపెనీలు, సంస్థలు, ప్రభుత్వ రంగాలు కూడా "ఏం చదివారు?" అన్నదానితో పాటు "ఏం చేయగలరు?" అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు.నైపుణ్యాలే మన ఆయుధం, ఆత్మవిశ్వాసమే మన బలం, కృషే మన విజయానికి మార్గం అని వివరించారు.

సైకాలజిస్ట్ శ్రీమతి జ్యోతిర్మయి మాట్లాడుతూ యువత ముందుగా తమలోని బలహీనతలను గుర్తించి, వాటిని బలాలుగా మార్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్‌ను వినోదం కోసం మాత్రమే కాకుండా, నేర్చుకోవడానికి, కొత్త స్కిల్స్ సంపాదించడానికి, ఆన్‌లైన్ కోర్సులు చేయడానికి ఉపయోగించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, సెట్కూరు సిబ్బంది నిదీశ్,మౌలాలి మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu