Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LB Nagar: ఎల్బీనగర్‌లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ!

LB Nagar: ఎల్బీనగర్‌లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ!

hmtv 1 hr ago

LB Nagar: ఎల్బీనగర్‌లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ!

LB Nagar: నేటి పోటీ ప్రపంచంలో విద్యను మించిన సంపద లేదని, నేటి యువతరం స్వశక్తితో పాటు భారతీయ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి చాటి చెప్పడానికి విద్య ఎంతో సులభమైన మార్గమని ప్రముఖ సినీ నిర్మాత, సామాజికవేత్త, లయన్ బి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ సాయినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్నటువంటి నిరుపేద విద్యార్థులకు ప్రముఖ సామాజికవేత్త లయన్ కవిత హీరానందాని, ప్రముఖ సినీ రచయిత బి వెంకటరమణతో కలిసి విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డురాదని, క్రమశిక్షణ గల విద్యను నేర్చుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించాలని వారు ఆకాంక్షించారు. పాఠశాల విద్య ఎంతో కీలకమని, విద్యతోపాటు విద్యార్థులకు అనుకోగా ఉన్నటువంటి క్రీడారంగంలో కూడా విద్యార్థులు రాణించాలని వారు విద్యార్థులకు సూచించారు.

పేద విద్యార్థులను ఆదుకోవడానికి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu