LB Nagar: నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెద్దపీట
LB Nagar: ఎల్బీనగర్ హస్తినాపురం డివిజన్ పరిధిలోని జయకృష్ణ ఎంక్లేవ్ నందు నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే ఇట్టి స్విమ్మింగ్ ఫూల్ పనులు తుదిదశకు చేరుకోవడం జరిగింది అని తెలిపారు.
అతి త్వరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది అని తెలిపారు. హైదరాబాద్‌లో ఈత కొలనులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోందన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్, ప్రభుత్వ స్థాయిలో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పిల్లలు, యువత, మహిళలు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈతపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో కూడా స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. ఈత నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఇట్టి స్విమ్మింగ్ పూల్‌లో డ్రెస్సింగ్ రూములు, ఫిల్టరేషన్ ప్లాంట్, వెయిటింగ్ హాల్, కోచ్ గది తదితర ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
గతంలో జి.హెచ్.ఎం.సి పరిధిలో నిర్మించిన 15 స్విమ్మింగ్ పూల్స్‌లో ఎల్.బి.నగర్ నియోజకవర్గానికి మూడు స్విమ్మింగ్ పూల్స్ తీసుకురావడం జరిగిందన్నారు. అందులో రెండు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మరొకటి నిర్మాణ దశలో ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో నిర్మించగా, ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్విమ్మింగ్ పూల్‌ను అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించడం జరుగుతోందన్నారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అలాగే నియోజకవర్గ పరిధిలో పార్కులు, ప్లే గ్రౌండ్స్ మరియు ఇతర మౌళిక సదుపాయాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సుధీర్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో హస్తినాపురం డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు ఆందోజు సత్యంచారి, వనస్థలిపురం డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

