Dailyhunt
LB Nagar: రోడ్డుపై పార్టీ చేసుకుంటే జైలుకే.. చైతన్యపురి పోలీసుల 'మిడ్ నైట్' సర్ప్రైజ్!

LB Nagar: రోడ్డుపై పార్టీ చేసుకుంటే జైలుకే.. చైతన్యపురి పోలీసుల 'మిడ్ నైట్' సర్ప్రైజ్!

hmtv 1 week ago

LB Nagar: రోడ్డుపై పార్టీ చేసుకుంటే జైలుకే.. చైతన్యపురి పోలీసుల 'మిడ్ నైట్' సర్ప్రైజ్!

ఎల్బీనగర్: చైతన్యపురి.. రోడ్లపై పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరి గింది.

ఇన్ స్పెక్టర్ కే సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధుల్లో భాగంగా కొత్తపేట నుంచి నాగోల్ వెళ్తూ చిత్తరమ్మ ఆలయం సమీపంలో గస్తీ తిరుగుతున్నారు. అక్కడ కౌశిక్ ఠాకూర్ @ లక్కీ అనే వ్యక్తి తన స్నేహితులైన అంధోజ సాయిరామ్, దోసాద విశాల్ రెడ్డి, సయ్యద్ సొహిల్, అంకిత్, ఆరిఫ్, నిహాంత్, వెంకట్, యశ్వంత్ రెడ్డి, నితి న్ తదితరులతో కలిసి రోడ్డు మీద అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించి శాంతికి భంగం చేశారు. వెంటనే వారందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి లేట్ అవర్స్లో షాపులు నడిపిస్తున్న కొత్తపేటలోని పిజ్జా హట్, వికాస్ నగర్ లోని టిల్లు ఫార్మా పాన్ షాపులపై సైతం కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్లపై అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు, పార్టీలు, పరిమితిని మించిన సమయంలో షాపులు నడపడం ఇతర కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల సామాన్య జీవనాని కి ఆటంకం కలుగుతుందన్నారు. ఇలాంటి చర్యలు చట్టవ్య తిరేకం అని, పబ్లిక్ న్యూసెన్గా పరిగణించబడి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu