Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LB Nagar: ఉద్యమకారుల గుర్తింపులో జాప్యం వద్దు: కాచం సత్యనారాయణ

LB Nagar: ఉద్యమకారుల గుర్తింపులో జాప్యం వద్దు: కాచం సత్యనారాయణ

hmtv 2 weeks ago

LB Nagar: కాచం సత్యనారాయణ శెట్టి గౌడ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

LBనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపులో ప్రభుత్వం జాప్యం చేయొద్దని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు.

కమిటీ పేరుతో కాలయాపన కాకుండా ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

అరెస్టు వివరాలు: తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇచ్చిన భూపోరాటం పిలుపునకు మద్దతుగా పాల్గొన్న కాచం సత్యనారాయణను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

కాచం వివరణ: ఈ సందర్భంగా మాట్లాడిన కాచం సత్యనారాయణ, తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఉద్యమకారుల హక్కుల కోసం చేపట్టిన భూపోరాటానికి మాత్రమే మద్దతు తెలిపామని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి డిమాండ్లు:

1. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డులు ఇస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.

2. కేశవరావు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా అర్హులైన ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందించాలి.

3. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు తగిన గౌరవం కల్పిస్తూ, ఆగస్టు 6లోపు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu