Dailyhunt
Love Story:  రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన పాట...కుర్రకారును ఊపేసిన పాట ఇదే

Love Story: రమ్యకృష్ణను కృష్ణవంశి ప్రేమలో పడేలా చేసిన పాట...కుర్రకారును ఊపేసిన పాట ఇదే

hmtv 1 week ago

Ramya Krishna Krishna Vamsi Love Story: ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మనసులో కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు. కానీ, గుండెల్లో నిలిచిపోయిన ఆ ప్రేమను తొలగించడానికి ఓ జీవితం కావాలి.

అందుకే ప్రేమ అంత గొప్పది. ఎవరైనా ప్రేమలో పడొచ్చు. కృష్ణవంశీ రమ్యకృష్ణల మాదిరిగా. సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్‌ దర్శకుడిగా పేరుగాంచిన కృష్ణవంశీ...నటి రమ్యకృష్ణల వివాహ బంధం వెనుకనున్న అసలు రహస్యం గులాబీ చిత్రంలోని ఓ సాంగ్‌ అని తాజాగా వెల్లడైంది. ప్రపోజల్స్‌ లేకుండానే వీరిద్దరూ ఒక్కటయ్యారు.

వెండితెరపై శివగామిగా గంభీరమైన పాత్రలు పోషించే రమ్యకృష్ణకు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి మధ్య చిగురించిన ప్రేమకథ సినిమాని మించిన ఆసక్తిని కలిగిస్తుంది. సాధారణంగా హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం సహజం, కానీ ఒక దర్శకుడు, ఒక స్టార్ హీరోయిన్ ఎలా దగ్గరయ్యారనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తమ బంధం వెనుక ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఆ ఒక్క అభినందనతో మొదలు..

వీరిద్దరి పరిచయానికి బీజం పడింది 'గులాబి' సినిమా పాటలతోనే. అప్పటికే రమ్యకృష్ణ పెద్ద స్టార్. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'గులాబి'లోని 'మేఘాలలో తేలిపొమ్మన్నది' వంటి పాటలు చూసి రమ్యకృష్ణ ఫిదా అయిపోయారట. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో పాటకైతే ఫేవరేట్‌ అయ్యారు. అప్పటి నుంచి రమ్యకృష్ణ హృదయం..ఏ రోజైతే చూశానో నిన్ను.. అంటూ పదేపదే కలవరిస్తోందట. ఒకసారి 'నిన్నే పెళ్ళాడతా' సినిమా చర్చల కోసం కృష్ణవంశీ సెట్స్‌కు వెళ్లినప్పుడు రమ్యకృష్ణను కలవడం జరిగింది. అప్పుడు రమ్యకృష్ణ స్వయంగా బ్రహ్మానందాన్ని పిలిచి, వంశీని పరిచయం చేయమని కోరారట. "తెలుగులో ఇంత ఫ్రెష్‌గా సాంగ్స్ తీస్తారని ఊహించలేదు" అంటూ ఆమె ఇచ్చిన కాంప్లిమెంట్ వారి మధ్య స్నేహానికి తొలి అడుగు వేసింది. స్నేహం పేరుతో పడిన తొలి అడుగులే ప్రేమకు బాటలు వేశాయి.

ప్రపోజల్స్ లేని ప్రేమకథ

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీరిద్దరిలో ఎవరూ ఒకరికొకరు 'ఐ లవ్ యూ' అని చెప్పుకోలేదు. కేవలం తొలిపరిచయంతోనే తొలి చూపులు కలిశాయి. స్నేహంతో బంధం బలపడింది. ఇదేనా ప్రేమంటే అని తెలియకుండానే ప్రేమించుకున్నారు. ప్రేమ చిగురించి సింధూరం బోట్టులా మారింది. ఆరోజుల్లో ఫోన్లు అందుబాటులో ఉండేవి కాదు. కేవలం ల్యాండ్‌లైన్లు లేదా పేజర్లు. ఈ పేజర్ల ద్వారానే సందేశాలు పంపుకునేవారట. సుమారు నెల రోజుల్లోనే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం పెళ్లి వరకు దారితీసిందని కృష్ణవంశి గుర్తుచేసుకున్నారు.

నచ్చిన గుణం - "మోర్ హ్యూమన్"

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఉంటుంది. అయితే, దానిని అందరూ గుర్తించలేరు. గుర్తించినవారు అస్సలు వదిలిపెట్టరు. కృష్ణవంశీ కూడా అంతే. ఓసారి షూటింగ్‌లో పనిచేసే ఓ సాధారణ వ్యక్తి అనారోగ్యానికి గురైతే..రమ్యకృష్ణ అతని ఇంటికి వెళ్లి ఎవరికీ తెలియకుండా తలగడ కింద డబ్బులు పెట్టి వచ్చిన ఆమె సంస్కారం తనను కట్టిపడేసిందని వంశీ చెబుతాడు. చంద్రలేఖ సినిమా సమయానికి నాగార్జున వంటి స్నేహితులకు వీరి విషయం తెలిసినా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. నిజాయితీగా, హుందాగా ప్రారంభమైన వీరి ప్రయాణం నేటికి ఆదర్శనీయంగా కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu