Dailyhunt
Macherla Honour Killing Case: పరువు హత్య వెనుక పోలీసు హస్తం.. చౌడేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు!

Macherla Honour Killing Case: పరువు హత్య వెనుక పోలీసు హస్తం.. చౌడేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు!

hmtv 2 weeks ago

Macherla Honour Killing Case: పరువు హత్య వెనుక పోలీసు హస్తం.. చౌడేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు!

Macherla Honour Killing Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాచర్ల చౌడేశ్వరి పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

కన్నకూతురిని తండ్రి కిరాతకంగా చంపిన ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆచూకీ కనిపెట్టి, ఆమెను తండ్రికి అప్పగించేందుకు సదరు అధికారి భారీ మొత్తంలో నగదు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

నగదు ఆశ చూపి.. కూతురిని పట్టించి..

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి(23), నాగరాజు జంట నరసరావుపేటలో రహస్యంగా నివసిస్తున్నారు. వీరి ఆచూకీ కనిపెట్టేందుకు చౌడేశ్వరి తండ్రి ఓ పోలీసు అధికారితో డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా సదరు అధికారికి రెండు విడతలుగా పెద్ద మొత్తంలో నగదు అందినట్లు ప్రధాన నిందితుడు అంగీకరించాడు.

పోలీసుల తీరుపై విమర్శలు:

నరసరావుపేటలో ఉంటున్న కొత్త జంటను మాచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మేజర్‌నని, భర్త నాగరాజుతోనే ఉంటానని చౌడేశ్వరి మొత్తుకున్నా సరే.. ఆ అధికారి వినకుండా ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం, ఆ అధికారి సెలవులో ఉన్న రోజునే చౌడేశ్వరి హత్య జరిగింది.

బయటపడ్డ పాపం:

హత్య అనంతరం పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసి, సహజ మరణంగా చిత్రీకరించాలని నిందితులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అసలు విషయం బయటపడింది. రక్షించాల్సిన పోలీసులే భక్షకులకు సహకరించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu