Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: మదనపల్లె 28వ వార్డు అభివృద్ధికి కృషి రామకృష్ణ చారి

Madanapalle: మదనపల్లె 28వ వార్డు అభివృద్ధికి కృషి రామకృష్ణ చారి

hmtv 39 mins ago

Madanapalle: మదనపల్లె 28వ వార్డు అభివృద్ధికి కృషి రామకృష్ణ చారి

మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్‌గా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ చారి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా పచ్చిపాల రామకృష్ణ చారి మాట్లాడుతూ.. 28వ వార్డు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రమాణ స్వీకారం అనంతరం రామకృష్ణ చారి, తులసి దంపతులకు వార్డు ప్రజలు, సీనియర్ నాయకులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu