Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: మదనపల్లెలో 'షైనింగ్ స్టార్స్-2026'!

Madanapalle: మదనపల్లెలో 'షైనింగ్ స్టార్స్-2026'!

hmtv 16 hrs ago

Madanapalle: మదనపల్లెలో 'షైనింగ్ స్టార్స్-2026'!

Madanapalle: మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్ కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్-2026' మరియు 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు రవాణా, మౌలిక వసతుల శాఖ మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు రూ.20,000 ప్రోత్సాహక చెక్కులు, ప్రశంసా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేసి అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహించేలా పలు సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu