Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: రామసముద్రంలో వీధి కుక్కల స్వైర విహారం భయం గుప్పిట్లో జనం!

Madanapalle: రామసముద్రంలో వీధి కుక్కల స్వైర విహారం భయం గుప్పిట్లో జనం!

hmtv 1 week ago

Madanapalle: రామసముద్రంలో వీధి కుక్కల స్వైర విహారం భయం గుప్పిట్లో జనం!

మదనపల్లె: నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయని వాపోతున్నారు. వాహనాల్లో వెళ్లే వారిని వెంబడించడం, చిన్నారులు మరియు వృద్ధులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu