Dailyhunt
Madanapalle: ఉచిత హాకీ శిబిరం.. 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం

Madanapalle: ఉచిత హాకీ శిబిరం.. 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు అవకాశం

hmtv 3 days ago

Madanapalle: మదనపల్లె పట్టణంలో గురు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల సౌజన్యంతో ఉచిత హాకీ శిబిరం నిర్వహించబడుతోంది. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ఈ శిబిరం 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు అందుబాటులో ఉండగా, హాకీ క్రీడలో ప్రాథమిక నైపుణ్యాల నుండి ప్రొఫెషనల్ స్థాయి శిక్షణ వరకు అందించనున్నారు.

శిబిరం మదనపల్లెలోని ఆరోగ్యమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సీనియర్ హాకీ క్రీడాకారుడు మరియు గురు హాకీ క్లబ్ అధ్యక్షుడు గురు భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కోచ్‌లుగా గౌస్, విష్ణు శిక్షణ అందిస్తున్నారు. హాకీపై ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 9491754476, 8142868687 ఫోన్ నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu